కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
కేంద్ర హోమ్ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ రీజనల్ ఇంప్లిమెంటేషన్ ఆఫీసెస్ లో రీసెర్చ్ ఆఫీసర్ (ఇంప్లిమెంటేషన్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అయితే దీనిలో మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ 2021 ఆగస్ట్ 12. దేశంలోని ఎనిమిది రీజనల్ ఇంప్లిమెంటేషన్ ఆఫీసుల్లో ఈ పోస్టులున్నాయి.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్, హిందీ లేదా ఇతర మీడియంలో చదివి ఉండాలి. వయస్సు వచ్చేసి 30 ఏళ్లు ఉండాలి. రీజనల్ ఇంప్లిమెంటేషన్ ఆఫీసులు ఉన్న ప్రాంతాలు అయితే ఢిల్లీ, ఘజియాబాద్, భోపాల్, ముంబై, కోల్‌కతా, గువాహతి, బెంగళూరు, కొచ్చిన్.
దరఖాస్తు ఫీజు రూ.25. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://upsconline.nic.in/ లో తెలుసుకోవచ్చు. ఆ తరవాత ఈ వెబ్సైట్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. రూ.1,50,000 వరకు జీతం ఉంటుంది.