నదీ జలాల వివాదం.. గోదావరి బోర్డు మీటింగుకి హాజరు కామంటున్న తెలంగాణ.

-

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్న నీటి వివాదం గురించి తెలిసిందే. రాయలసీమ ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అనేక వాదనలు జరుగుతున్నాయి. తాజాగా ఈ అంశం మరో మలుపు తిరిగింది. రాయలసీమ ప్రాజెక్టు పరిశీలనకు సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు వెళ్ళనున్నారు. ఐతే అందులో దేవేందర్ రావు ఉండడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. వాటర్ కమీషన్ లోని సభ్యులకు ప్రాంతాలను ఆపాదించడం సబబు కాదని, గతంలో శ్రీనివాసరావు లాంటి సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని కేఆర్ ఎంబీకి లేఖ రాసింది.

ఇంకా, ఎన్జీటీ ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ కోరింది. మరోవైపు, గోదావరి నదీ జలాల బోర్డు మీటింగుకి హాజరు కాలేమని, సుప్రీం కోర్టు, ఎన్జీటీలో విచారణ కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నామని గోదావరి బోర్డుకు తెలిపింది. మొత్తానికి నదీ జలాల వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news