వైసీపీ-టిడీపీ మధ్య ముదురుతున్న పులిచింతల గేటు వివాదం.. అసలేం జరిగింది?

-

పులిచింతల గేటు వివాదం రోజు రోజుకీ ముదురుతుంది. వరద ఉధృతి పెరుగుతుండడంతో 16వ తేటును ఎత్తుతుండగా గేటు ఊడిపోయిన వైనం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాజెక్టు పూర్తయి పదేళ్ళు కూడా పూర్తికాకముందే గేటు కొట్టుకుపోవడం అనేక అనుమానాలకు తెర తీసింది. ఈ విషయంలో ఇటు వైసీపీ, అటు టిడీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. చంద్రబాబు హయాంలో శంకుస్థాపన జరిగిన పులిచింతల ప్రాజెక్టు, ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో పూర్తయిందని, నిర్మాణంలో లోపాలు ఉండడం వల్లే ఇలా జరిగిందని టీడీపీ ఆరోపిస్తుంది.

మరో పక్క వైసీపీ వాదన మరోలా ఉంది. చంద్రబాబు కమీషన్లు తీసుకోవడం వల్లే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో లోపాలు వచ్చాయని, తప్పంతా చంద్రబాబుదే అని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాసిరకం మెటీరియల్ వాడారని, దానివల్లే ఇలా జరిగిందని వైసీపీ నాయకుల ఆరోపణ. మొత్తానికి పులిచింతల గేటు వివాదం మరింత ముదురుతుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతానికి ఊడిపోయిన గేటు స్థానంలో స్టాప్ లాక్ గేటును బిగించారు.

Read more RELATED
Recommended to you

Latest news