ఈ పండ్లతో వీటిని క‌లిపి తిన‌వ‌ద్దు.. య‌మ డేంజ‌ర్‌

-

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలానే మంచి జీవన విధానాన్ని పాటించాలి. అయితే కొన్ని కొన్ని సార్లు మనకి తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. పండ్లు తినేటప్పుడు వాటితో కొన్ని రకాల ఆహార పదార్థాలను మిక్స్ చేసి తినడం వల్ల సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పండ్లని తినేటప్పుడు ఇలా మిక్స్ చేసి తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని అంటున్నారు, అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

  •  బొప్పాయి – నిమ్మరసం : ఎప్పుడైనా బొప్పాయి పండు తినేటప్పుడు నిమ్మరసం కానీ నిమ్మకాయ కానీ కలిపి తీసుకోవద్దు అని డాక్టర్లు అంటున్నారు. ఇది చాలా ప్రాణాంతకమైనది. ఇలా తింటే ఎనిమియా సమస్యకి ఇది దారితీస్తుందని.. హిమోగ్లోబిన్ లో కూడా సమస్యలు వస్తాయి.
  • క్యారెట్ –  కమలాలు : అలాగే క్యారెట్ తో పాటు కమలాలు తినకూడదని అంటున్నారు. ఇలా కనుక తింటే తప్పక కిడ్నీ సమస్యలు వస్తాయని చెప్పడం జరిగింది.
  • అరటి పండు – జామకాయ : అదే విధంగా అరటి పండు, జామకాయ కూడా కలిపి తీసుకోవద్దని అంటున్నారు. ఇలా కనుక తింటే గ్యాస్ సమస్యలు, తలనొప్పి వస్తాయని చెప్తున్నారు.
  • పుచ్చకాయ – కర్బూజా  : పుచ్చకాయ మరియు కర్బూజా కూడా కలిపి తీసుకోకూడదు. దీని వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి.
  • అలానే పైనాపిల్ తో పాటు పాలు తీసుకోకూడదు అని చెప్తున్నారు. పాలలో ఉండే క్యాల్షియం పైనాపిల్ లో ఉండే పోషక పదార్థాలు రెండింటి వల్ల ఇబ్బంది వస్తుందని పాలతో పాటు పైనాపిల్ తీసుకోవద్దని అంటున్నారు.
  • పులుపు – పెరుగు : పుల్లగా ఉండే పండ్లు ఎప్పుడూ పెరుగుతో తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే అస్సలు అరగదు అని అంటున్నారు.
  • ప‌న‌స – పాలు : అదే విధంగా పనస పండుని పాలతో పాటు తీసుకోకూడదు. ఇలా కనక చేశారు అంటే చర్మ సమస్యలు వస్తాయి. కనుక ఎప్పుడైనా ఈ పండ్లను తింటే ఈ తప్పులు చేయకుండా చూసుకోండి లేదు అంటే ఏ సమస్యలు తప్పవు.

Read more RELATED
Recommended to you

Latest news