నలుగురు సీనియర్ కాంగ్రెస్ నాయకుల ట్విట్టర్ ఖాతాలకు లాక్.. అసలేం జరిగిందంటే,

-

జాతీయ స్థాయిలో నలుగురు సీనియర్ కాంగ్రెస్ నాయకుల ట్విట్టర్ ఖాతాలు తాత్కాలికంగా లాక్ అయ్యాయి. రాహుల్ గాందీ ట్విట్టర్ అకౌంట్ లాక్ అయిన తర్వాత జరిగిన ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ట్విట్టర్ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను లాక్ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కి చెందిన రణ్ దీప్ సూర్జేవాలా, అజయ్ మేకన్, సుష్మితా దేవ్, మనికన్ ఠాగోర్ మొదలగు వారి ట్విట్టర్ ఖాతాలను తాత్కాలికంగా లాక్ చేసారు.

ఈ నలుగురిలో సూర్జేవాలా కాంగ్రెస్ కు చెందిన ప్రఖ్యాత వక్త. అలాగే అజయ్ మేకన్, రాజస్థాన్ కాంగ్రెస్ కి జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు. సుష్మితా దేవ్ మహిళా కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఠాగూర్, పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నారు. రాహుల్ గాంధీ ఖాతాను లాక్ చేయడంపై ఢిల్లీ హైకోర్టుకు వివరించిన ట్విట్టర్, మానభంగం జరిగిన నిందితురాలి కుటుంబ సభ్యుల ఫోటోలు ఆ ఖాతా ద్వారా షేర్ కాబడ్డాయని, అది ట్విట్టర్ పాల్సీకి విరుద్ధం అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news