ఈ ఐదు జిల్లాలపైనే టీడీపీ ఫోకస్.. పక్కా ప్లాన్‌తో పార్టీకి పూర్వవైభవం?

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన టీడీపీ పార్టీ తన ప్రాభవాన్ని మెల్లమెల్లగా కోల్పోతున్నది. తెలంగాణలో అయితే టీడీపీ నేతలంరూ వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఇక విభజిత ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది ఆ పార్టీ. ఈ క్రమంలోనే పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచిస్తున్నారట. ఏపీలోనైనా మళ్లీ అధికారంలోకి రావాలని ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల నాటి పరిస్థితులను విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో కేవలం ఐదు జిల్లాలతోనే టీడీపీ అధికారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే.. ఉత్తరాంద్రలోని గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, రాయలసీమలోని చిత్తూరు. ఈ ఫైవ్ డిస్ట్రిక్ట్స్‌లోని అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సీట్లు టీడీపీ గెలుచుకోవడం ద్వారా మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయినట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆ నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకోవాలని టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారట.

TDP Party | తెలుగుదేశం పార్టీ
TDP Party | తెలుగుదేశం పార్టీ

ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో మునుపటి మాదిరి 25 సీట్లు టీడీపీ కైవసం చేసుకుంటే భవిష్యత్తులో టీడీపీకి పూర్వ వైభవం కంపల్సరీ అని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యల పట్ల స్పందించడం మాత్రమే కాకుండా ప్రజలతో మమేకమయ్యే పనులు చేయాలని టీడీపీ నేతలకు టీడీపీ అధినేత నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ సంగతులు ఇలా ఉండగా అధికార వైసీపీ పార్టీలో నేతల మధ్య విభేదాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష టీడీపీ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్‌గా ప్రజలకు చేరువయ్యే చాన్సెస్ ఉంటాయి. టీడీపీ నేతలు పలు కార్యక్రమాలు చేయడం ద్వారానే శ్రేణులు, కార్యకర్తల్లో నూతనోత్తేజం వస్తుందని, కాబట్టి ప్రతీ నియోజకవర్గంలో ఇన్‌చార్జిలుగా తెలుగుదేశం నేతలు స్థానికంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలని టీడీపీ అధినేత సూచించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news