జగిత్యాలలో కలకలం : శవాన్ని బతికిస్తామంటూ క్షుద్ర పూజలు..

-

జగిత్యాల జిల్లా లో ఒక్కసారిగా క్షుద్ర పూజలు కలకలం రేపాయి. చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ శవం దగ్గర క్షుద్ర పూజలు చేశారు..అయితే ఈ విషయం తెలిసిన పోలీసులు క్షుద్ర పూజలను భగ్నం చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… జగిత్యాల రూరల్ మండలం టిఆర్ నగర్ లో నివాసం ఉంటున్న ఒర్సు రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా చనిపోయడంటూ కుటుంబ సభ్యులు అందోళన చెందారు. మంత్రాల నెపంతో రమేష్ మృతి చెందాడని.. కుటుంబ సభ్యులు స్థానికంగా ఉంటున్న పుల్లయ్య అనే వ్యక్తిని చితక బాదారు. అయితే చివరికి.. తానే మంత్రాలతో రమేష్ ని చంపానని ఒప్పుకున్నాడు పుల్లయ్య.

మృతి చెందిన రమేష్ ను మళ్ళీ బ్రతికిస్తానంటూ..కుటుంబ సభ్యులకు పుల్లయ్య వివరించారు. దీనికి రమేష్ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. దీంతో ఇవాళ ఉదయం నుండి రమేష్ శవం దగ్గర పుల్లయ్య పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పుల్లయ్య ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రమేష్ మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news