కాసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… హుజరాబాద్ నియోజకవర్గానికి చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్…. కాసేపటి క్రితమే హుజురాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా… దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనంతరం పదిహేను మంది లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ఇదే వేదిక మీద నుండి రైతు బందు కి శ్రీకారం చుట్టమని ప్రకటించారు. దీనికి అందరం గర్వ పడుతున్నా మన్నారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఘనంగా పెరిగిందని.. కరీంనగర్ లో రైతు భీమా ప్రారంభించు కున్నామని వెల్లడించారు కెసిఆర్. నా జీవితం లో కొత్త చరిత్ర సృష్టించే పథకం దళిత బందు అని పేర్కొన్నార ఆయన ఇదో మహా ఉద్యమమన్నారు. చిల్లర మల్లరా ఆలోచనలు లేకుండా చేస్తామని.. తెలంగాణ ప్రజలకు విజయం చేకూర్చే జిల్లా గా కరీంనగర్ మారిందన్నారు.