తెలంగాణ రాష్ట్ర రాజధాని మహా నగరం హైదరాబాద్. ఈ మహా నగరం హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నగరం పెద్ద పెద్ద కంపెనీల తో సహా… అనేక చూడదగ్గ ప్రదేశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా పార్కులు హైదరాబాదులో బాగా ఫేమస్. ఇందిరా పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, జువాలాజికల్ పార్క్, కృష్ణ కాంత్ పార్క్, నెహ్రూ జూలాజికల్ పార్క్ ఇలా ఎంతో ప్రాముఖ్యత చెందిన పార్కులు హైదరాబాద్ మహానగరంలో ఉన్నాయి.
అయితే ఈ పార్కుల్లో…. పిల్లల కంటే ఎక్కువగా ప్రేమ జంట లే కనిపిస్తాయి. కాలేజీలు బంక్ కొట్టి… ప్రేమికులు ఈ పార్కులో ఎంతో ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఇందిరా పార్క్ లో…. ప్రేమికుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్ యాజమాన్యం… ఈ ప్రేమ జంటలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
“పెళ్లి కాని జంటలకు పార్కులో నికి ప్రవేశం లేదు” అంటూ తాజాగా ఓ బోర్డు పెట్టింది ఇందిరాపార్కు యాజమాన్యం. ఇకముందు పెళ్లికాని జంటలు ఇందిరా పార్కు కు రావద్దంటూ విజ్ఞప్తి చేసింది యాజమన్యం. దీంతో ప్రేమికులకు ఊహించని షాక్ తగిలింది. అంతేకాదు ఇందిరాపార్క్ తరహాలోనే హైదరాబాద్ మహానగరంలోని మరికొన్ని పార్కులు కూడా… ఇలాగే నిబంధనలు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.