కోవిషీల్డ్: డోసుల మధ్య వ్యవధి తగ్గించడంపై కేంద్రం క్లారిటీ..

-

కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ వేయించుకోవాలని, కరోనా నుండి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే సరైన ఆయుధమని అటు ప్రభుత్వంతో పాటు వైద్యులు సెలెబ్రిటీలు కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ ఒకటి కాగా, భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్ మరోటి. కరోనాను ఎదుర్కోవడంలో ఈ రెండు వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడైంది. ఐతే వ్యాక్సిన్ల డోసుల మధ్య వ్యవధి విషయంలో అనేక సందేహాలు, ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉందని, 84రోజుల వ్యవధి చాలా ఎక్కువ అని అంటున్నారు.

ఈ వ్యవధిని తగ్గించాలని గత కొన్ని రోజులుగా ప్రచారాలు నడుస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యవధిపై క్లారిటీ ఇచ్చింది. డోసుల మధ్య వ్యవధిని తగ్గించే అవకాశం లేదని, దీనికి సంబంధించి శాస్త్రవేత్తల నిపుణుల కమిటీ పరిశోధనలు జరుపుతుందని, రాబోయే రోజుల్లో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి డోసుల మధ్య వ్యవధి యధావిధిగా ఉంటుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news