ఈ శ్రమ్ పోర్టల్ స్టార్ట్ చేసిన ప్రధాని మోదీ.. లాభాలివే..!

-

మోదీ ఈ-శ్రమ్ పోర్టల్‌ ని ప్రారంభించడం జరిగింది. అయితే అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకు తీసుకు వచ్చారు. గురువారం ఈ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. అయితే దీని ద్వారా దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న నిర్మాణ, ఇతర కార్మికుల వివరాలను డేటా బేస్‌లో స్టోర్ చేయనున్నారు.

Narendra-Modi

 

దీనిలో ప్రతీ కార్మికుడికి ఆధార్ నెంబర్ తరహాలో 12 నెంబర్ల యూనివర్స్ అకౌంట్ నెంబర్ (UAN) ఇవ్వనున్నారు. మొత్తం దేశంలో 380 మిలియన్ అసంఘటిత రంగ కార్మికుల డేటాను రికార్డ్ చేయడమా జరిగింది. మరి ఇక ఈ పోర్టల్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే..

ఈ పోర్టల్ చాలా మందికి బెనిఫిట్ గా ఉంటుంది. అసంఘటిత రంగ కార్మికులు ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన (PMSYM), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) మరియు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇది ఇలా ఉంటే PMSYM, PMJJBY, PMSBY మరియు PM-JAY (ఆయుష్మాన్ భారత్) తో సహా సామాజిక భద్రత (పెన్షన్, భీమా) పథకాలు డేటాబేస్‌లో చేర్చబడుతాయి.

అలానే దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఇచ్చారు. పోర్టల్ తో పాటుగా టోల్ ఫ్రీ నంబర్ 14434 కూడా  ప్రారంభించబడుతుంది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద కుటుంబానికి రూ .5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా రక్షణ లభిస్తుంది.PMSYM లో రూ. 3000 పెన్షన్ అందుబాటులో కూడా వుంది.

Read more RELATED
Recommended to you

Latest news