ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ బిగ్‌ షాక్..

-

ఏపీలో ఆస్తి పన్ను పై వైసీపీ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ఆస్తి పన్ను పెంపుపై ఈ ఏడాది నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కరోనా కారణంగా దీని అమలును వాయిదా వేసినట్లు అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఏ మాత్రం కనికరం లేకుండా పెంచిన పన్ను ఏప్రిల్‌ 1 నుంచే వర్తిస్తుందని నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో భాగంగానే పట్టణ స్థానిక సంస్థలు గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. దీంఓ పన్ను చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు.

ఆస్తి పన్ను పెంపు పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం లెక్క చేయలేదని దీన్ని బట్టి తెలుస్తోంది. ఏపీ లో ఆస్తి పన్ను పెంపు పై ప్రభుత్వం భారీ షాకిచ్చింది. గతేడాది నుంచే ఆస్తి పన్ను పెంపు ప్రతి పాదనలు మొదలైనా.. వీటి పై అభ్యంతరాల నేపథ్యం లో ప్రభుత్వం వాయిదా వేస్తున్నట్లు నమ్మించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ కొత్త ఆస్తి పన్ను పెంపు పై ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తంమవుతుంటడం, విపక్షాల నిరససనల పెంపు పై నిర్ణయం తీసుకునేందుకు జంకింది. కానీ సరైన సమయం చూసి.. పన్ను పెంపు నిర్ణయాన్ని బయటపెట్టింది. దీంతో ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news