తీన్మార్ మల్లన్న కు 14 రోజుల పాటు రిమాండ్ !

-

తీన్మార్ మల్లన్న కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది సికింద్రాబాద్ కోర్టు. ఇవాళ తీన్మార్‌ మల్లన్న కు సంబంధించిన కేసును సికింద్రాబాద్ కోర్టు ఇవాళ విచారించింది. ఈ సందర్భంగా IPC 306, 511 సెక్షన్స్ పెట్టడం పై అభ్యంతరం తెలిపారు తీన్మార్ మల్లన్న తరుపు న్యాయవాది. ఫిర్యాదు దారుడు ఎలాంటి సూసైడ్ అట్టెంట్ చేయలేదని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లాడు న్యాయవాది.

అయితే…. దీనిపై పరిశీలి స్తామని పేర్కొంది కోర్డు. అటు 7 రోజుల పాటు కస్టడీ కి కోరారు చిలకల గూడా పోలీసులు. ఈ నేపథ్యంలో తీన్మార్‌ మల్లన్నకు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది సికింద్రాబాద్‌ కోర్టు. ఇందులో భాగంగానే… చంచల్ గూడ జైల్ కి తరలించాలని ఆదేశించింది. ఇక అటు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని తీన్మార్ నవీన్ తరుపు న్యాయవాది ఉమేష్ చంద్ర తెలిపారు. కాగా.. అటు తీన్మార్ మల్లన్న ను నిన్న అర్థ రాత్రి చిలకల గూడా పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news