తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 10 న గణేష్ ఉత్సవాలు ప్రారంభిస్తామని..మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. MCHRD లో ఈ సమావేశం జరిగింది. మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, మల్లారెడ్డి, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డి, శాసన మండలి విప్ ప్రభాకర్ రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, mla లు, mlc లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని… కరోనా వల్ల ఇబ్బందులు ఉన్నా, నియమాలు పాటిస్తూ నిర్వహించుకోవాలని వెల్లడించారు. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ లో వినాయక చవితి పండుగ ను నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి పండుగ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని…. వినాయక నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మట్టి గణపతులు, గోమయ గణపతులు కూడా తయారు చేస్తున్నారన్నారు.