రేవంత్‌ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి బామ్మర్ధి కౌంటర్‌.. ఖభర్దార్ బిడ్డా !

-

రేవంత్‌ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి బామ్మర్ధి కౌంటర్‌ ఇచ్చారు మద్దుల‌ శ్రీనివాస్ రెడ్డి (మంత్రి మల్లారెడ్డి బామ్మర్ధి). రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవాలని తెలిపారు. తనను ఉప సర్పంచ్ అని అన్నాడని…తాను సర్పంచ్ గా పనిచేసాను అని తెలుసుకోవాలని రేవంత్‌ కు చురకలు అంటించారు. మల్లారెడ్డికి అన్ని అనుమతులతో అప్పటి పాలక వర్గం ఇచ్చిందని… సరైనా సమాచారం తీసుకొని‌ ఆరోపణలు చేయాలని మండిపడ్డారు.

తప్పుడు ఆరోపణలు చేయవద్దని….ఖభర్దార్ బిడ్డా అని రేవంత్‌ పై నిప్పులు చెరిగారు. రేవంత్‌ రెచ్చగొట్టే వ్యాక్యలు మానుకోవాలని హెచ్చరించారు. యూనివర్శిటీకి కట్టబెట్టారని అనడం తప్పు అని… అది ప్రభుత్వ భూమి కాదు….పట్టా భూమి అని క్లారిటీ ఇచ్చారు. తన దగ్గర అన్ని భూముల డాక్యుమెంట్లు ఉన్నాయని…100% అనుమతులు ఉన్నాయని వివరించారు. 1989లో కొంటే 2017లో అనుమతులు వచ్చాయని… భూకభ్జా కేసులు ఉంటే కోర్టు ద్వారా తెలుసుకోవాలని చురకలు అంటించారు. రేవంత్‌ రెడ్డి ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news