పొట్ట కొవ్వు.. కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఎంతకీ తగ్గకుండా ఉంది ఇబ్బంది పెడుతుంటుంది. ఇది సాధారణంగా పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది.
తొడ కొవ్వు.. తొడ భాగంలో కొవ్వు మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది.
ముందుగా పొట్టకొవ్వు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకానొక అధ్యయనం ప్రకారం పొట్టకొవ్వు వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దానివల్ల మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ అని నిపుణుల అభిప్రాయం. అలాగే గుండె సంబంధిత సమస్యలు రావడానికి కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
తొడకొవ్వు వల్ల జీవక్రియ సమస్యలకు ఎలాంటి విఘాతం లేదు.
ఈ రెండింట్లో ఏ కొవ్వు తొందరగా కరుగుతుంది?
అధిక కొవ్వు ఎక్కడ ఉన్నా కరిగించాల్సిందే. తొడ భాగంలో అయినా పొట్టభాగంలో అయినా కరిగిస్తేనే మంచిది. ఐతే దానికోసం ప్రయత్నాలు చేసేవారు ఏ కొవ్వు తొందరగా కరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. పొట్టభాగంలో ఉన్న కొవ్వు కంటే తొడభాగంలో ఉన్న కొవ్వు సులభంగా కరుగుతుంది.
దీనికి కారణం ఏమిటి?
శరీరంలో కొవ్వు రెండు రకాలుగా ఉంటుంది. ఆల్ఫా, బీటా. ఈ రెండింట్లో ఆల్ఫా కణాలు కలిగిన కొవ్వు తొందరగా కరుగుతుంది. బీటా కొవ్వు చాలా మొండిగా ఉంటుంది. తొడ భాగంలో ఆల్ఫా కొవ్వు ఉంటుంది. పొట్ట భాగంలో బీటా కొవ్వు ఉంటుంది.
మరేం చేయాలి?
రోజూ వ్యాయామం, నడక, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, మనస్ఫూర్తిగా తినడం మొదలైనవి పొట్ట కొవ్వును కరిగించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మీ జీవనశైలిని మార్చుకుని పొట్ట కొవ్వును తగ్గించుకు అనేక ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉండండి.