నాడు-నేడు: రేవంత్‌ని వదలని మోత్కుపల్లి…

-

రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు….ఇద్దరు తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకులే. కాకపోతే రేవంత్ కంటే మోత్కుపల్లి కాస్త సీనియర్ నాయకుడు. ఈ ఇద్దరు టీడీపీలో అనేక ఏళ్ళు పనిచేసిన నాయకులే. అయితే ఈ ఇద్దరు నాయకులకు టి‌డి‌పిలో ఉండగానే పెద్దగా పడేది కాదని అప్పటిలోనే ప్రచారం జరిగేది. రేవంత్ అనూహ్యంగా తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రజల్లో ఫాలోయింగ్ పెంచుకోవడమే కాకుండా అప్పుడు అధినేత చంద్రబాబుకు ప్రియ శిష్యుడుగా ఉండేవారు. అందుకే చంద్రబాబు సైతం రేవంత్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇదే మోత్కుపల్లికి నచ్చేది కాదు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

పార్టీలో సీనియర్లుగా ఉన్న తమని పట్టించుకోకుండా రేవంత్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై మోత్కుపల్లి గుర్రుగా ఉండేవారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడంపై కూడా తీవ్ర అసంతృప్తిగా ఉండేవారు. అయితే ఇలా రేవంత్‌ని మోత్కుపల్లి టీడీపీలో ఉండగానే టార్గెట్ చేశారు. ఇక ఇప్పుడు కూడా మోత్కుపల్లి, రేవంత్‌ని వదలడం లేదు. టీడీపీని వీడాక బి‌జే‌పిలో చేరిన మోత్కుపల్లి, ఇప్పుడు బయటకొచ్చేసి కే‌సి‌ఆర్‌కు మద్ధతు ఇస్తున్న విషయం తెలిసిందే. దళితబంధు ప్రకటించడంతో కే‌సి‌ఆర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే కే‌సి‌ఆర్ దళితులని ఇంతకాలం మోసం చేసి ఇప్పుడు దళితబంధు పేరుతో రాజకీయం చేస్తున్నారని టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే దళిత, గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతూ భారీ ఎత్తున దండోరా సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దళితులకు న్యాయం చేస్తున్న కే‌సి‌ఆర్‌పై రేవంత్ బురదజల్లుతున్నారని, ఆయన తీరుకు నిరసనగా మోత్కుపల్లి దీక్షకు కూడా చేశారు.

కానీ మోత్కుపల్లి ఇప్పుడు సడన్‌గా రేవంత్‌పై ఫైర్ అవ్వడం వెనుక రాజకీయం ఉందని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఏదొరకంగా రాజకీయంగా హైలైట్ అవ్వడానికి మోత్కుపల్లి, రేవంత్‌ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news