నాని జెర్సీ బిజినెస్ అదిరింది..!

-

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా టీజర్ ఆడియెన్స్ ను మెప్పించింది. సినిమాలో మధ్య వయస్కుడి పాత్రలో నాని కనిపిస్తాడని తెలుస్తుంది. ఇదిలాఉంటే నాని జెర్సీ సినిమాకు అదిరిపోయే బిజినెస్ జరుగుతుండటం విశేషం. స్క్రిప్ట్ నచ్చి రెమ్యునరేషన్ లేకుండా లాభాల్లో వాటా తీసుకుంటానని నాని ఎందుకు చెప్పాడో ఇప్పుడు అర్ధమైంది.

ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ లో దాదాపుగా 12 కోట్ల పలికిందట. ఇక రీమేక్ రైట్స్ కూడా 6 కోట్లకు అమ్మేశారట. అంటే థియేట్రికల్ రైట్స్ కాకుండా జెర్సీ 18 కోట్లు బిజినెస్ చేసింది. ఎలా లేదన్నా తెలుగు రెండు రాష్ట్రాల్లో 25 నుండి 30 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. అంటే ఎలా లేదన్నా జెర్సీ సినిమా 50 కోట్ల దాకా బిజినెస్ చేస్తుందని తెలుస్తుంది. ఈ రేంజ్ బిజినెస్ జరగడం నానికి కెరియర్ లో మొదటిసారట. మరి నాని జెర్సీతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news