రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రం లో విద్యా సంస్థలు పునః ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. స్కూల్స్ రీ – ఓపెన్ పై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలలు రీ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది సర్కార్.
అన్ని ప్రభుత్వ, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ గురుకుల విద్యాలయాలు మినహా మిగిలిన తరగతులు రేపటి నుండి ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇష్టం లేకుండా పిల్లలను ఎవరు బలవంతం చేయొద్దని.. ప్రత్యక్ష మరియు ఆన్ లైన్ తరగతులు అన్నది పాఠశాల యాజమాన్యం ఇష్టమని… తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తల్లిదండ్రులకు నచ్చితేనే… పిల్లలను స్కూల్ కు రమ్మనాలని వెల్లడించింది. స్కూల్ మేనేజ్ మెంట్ ఆన్లైన్, ఆఫ్ లైన్, రెండు విధాలుగా తరగతులు నిర్వహించ వచ్చని తెలిపింది. వారం రోజుల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ పై గైడ్ లైన్స్ విడుదల చేస్తామని స్పష్టం చేసింది.