హైదరాబాద్ లోని హైటెక్స్ నోవటెల్ హోటల్ లో వైఎస్ సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. ఇవ్వాళ సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. వైఎస్ రాజశేకర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ సారథ్యం లో ఈ వైఎస్ సంస్మరణ సభ జరుగనుంది. ఇక ఈ వైఎస్ సంస్మరణ సభ కు 350 మంది అతిథులకు ఆహ్వానం అందినట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీ ల నుంచి 88 మంది కి ఆహ్వానం అందగా.. ఏపీ నుంచి 44 మంది నేతలను ఆహ్వానించారు వైఎస్ విజయమ్మ.
అలాగే సినిమా రంగం నుంచి 40 మంది ప్రముఖ నటులకు ఆహ్వానం అందించారు వైఎస్ విజయమ్మ. అంతే కాదు 18 మంది ప్రముఖ వ్యాపార వేత్తలకు,16 మంది వైద్యులకు ఆహ్వానం అందించారు వైఎస్ విజయమ్మ. 17 మంది సామాజిక వేత్తలు, వైఎస్ హయాంలో పని చేసిన మాజీ ఐఏఎస్ లు,ఐపీఎస్ లు, రిటైర్డ్ జడ్జీలు ఆహ్వానం అందింది. అంతే కాదు వైఎస్ సంస్మరణ సభ వేదిక మీద 33 మంది ముఖ్యులకు మాట్లాడే అవకాశం కల్పించనున్నారు. అయితే ఈ వైఎస్ సంస్మరణ సభలో ఎలాంటి విషయాలపై చర్చ జరుగుతోందనని తెలుగు రాష్ట్రాలలో చర్చ జరుగుతోంది.