సినీ ఆర్టిస్టు A.కృష్ణం అలియాస్ హీరో కృష్ణుడు అరెస్ట్ అయ్యాడు. పేకాట కేసు లో హీరో కృష్ణుడు అరెస్ట్ అయినట్లు సమాచారం అందుతోంది. హీరో కృష్ణుడు తో పాటు మరో ఎనిమిది కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది.
హైదరాబాద్ మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని శిల్పాపార్క్ విల్లా లో పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు హీరో కృష్ణుడుని అరెస్ట్ చేశారు. అయితే హీరో కృష్ణుడు తో పాటు ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజు, మరియు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు.. మియపూర్ పోలీసులు చాలా ప్లానింగ్ గా ఎటాక్ చేసి ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటన గురించి ఇంకా తెలియాల్సి ఉంది. కాగా నటుడు కృష్ణుడు.. తెలుగు చిత్ర పరిశ్రమలో.. కమేడియన్ గా మరియు మరికొన్ని సినిమాల్లో హీరో పాత్రల్లో అందరినీ కనువిందు చేసిన సంగతి తెలిసిందే.