BREAKING : సీఎం కేసీఆర్ డ్రైవర్ పై చీటింగ్ కేసు !

-

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కు ఊహించని పరిణామం ఎదురైంది. సీఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కాన్వాయ్ డ్రైవర్ శశికుమార్ పై కేస్ నమోదు అయింది. ఓ యువతిని మోసం చేసిన నేపథ్యం లో సిఎం కెసిఆర్ కాన్వాయ్ డ్రైవర్ శశికుమార్ పై కేస్ నమోదు అయినట్లు సమాచారం అందుతోంది. ఓ యువతి తో ఎంగేగ్మెంట్ చేసుకొని.. మరో యువతి ని విహహం చేసుకున్నాడు కాన్వాయ్ డ్రైవర్ శశి కుమార్.

అయితే ఈ విషయం తెలిసిన ఆ బాధితురాలు.. డ్రైవర్ శశి కుమార్ ను నిలదీసింది. అయినప్పటికీ డ్రైవర్ శశి కుమార్ ఆఅ యువతిని పట్టించుకోలేదు. అంతే కాదు ఎక్కడ.. చెప్పుకుంటావో చెప్పుకో అని బాధితురాలిని బెదిరించారు డ్రైవర్ శశి కుమార్. దీంతో ఎం చేయాలో తెలియక.. మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు బాధితురాలు. దీంతో కులసుంపురా పోలీస్ స్టేషన్ లో బాధితురాలి తో కేస్ నమోదు చేయించారు మానవ హక్కుల కమిషన్ సభ్యులు. ఇక ప్రస్తుతం ఈ ఘటన పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news