విచిత్రం: ఆ రెండుచోట్ల వైసీపీకి నాయకులు లేరా?

-

ఏపీలో అధికార వైసీపీకి తిరుగులేని బలం ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల బలం ఉంది. అటు టి‌డి‌పి, జనసేనల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలని కూడా కలుపుకుంటే వైసీపీకి 156 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అటు టి‌డి‌పికి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టి‌డి‌పి ఎమ్మెల్యేలు ఉన్న 19 స్థానాల్లో వైసీపీకి ఇంచార్జ్‌లు ఉన్నారు. అలాగే టి‌డి‌పికి ముగ్గురు ఎంపీల బలం ఉంది. కానీ టి‌డి‌పి ఎంపీలు ఉన్న రెండు స్థానాల్లో వైసీపీకి సరైన నాయకుడు లేకపోవడం గమనార్హం.

వైసీపీకి ఇంత బలమైన మెజారిటీ ఉండి కూడా రెండు పార్లమెంట్ స్థానాల్లో అ పార్టీకి నాయకులు లేరు. గత ఎన్నికల్లో గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాల్లో టి‌డి‌పి గెలిచింది. అయితే గుంటూరులో టి‌డి‌పి మీద పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారు. ప్రస్తుతం ఆయనే గుంటూరు పార్లమెంట్ బాధ్యతలు చూసుకుంటున్నారు. కానీ విజయవాడలో ఓటమి పాలైన పొట్లూరి వరప్రసాద్(పి‌వి‌పి) ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయారు.

ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ స్థానంలో వైసీపీకి ఇంచార్జ్ లేరు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది తెలియకుండా ఉంది. జగన్ మళ్ళీ పి‌వి‌పికే సీటు ఇస్తారా వేరే నాయకుడుని నిలబెడతారో క్లారిటీ లేదు.

అటు శ్రీకాకుళం పార్లమెంట్‌లో ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు టెక్కలి ఇంచార్జ్‌గా ఉన్నారు. ఈయన వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచే బరిలో దిగనున్నారు. మరి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో వైసీపీ తరుపున అభ్యర్ధిపై క్లారిటీ లేదు. ఇంకా ఇక్కడ ఇంచార్జ్ కూడా లేరు. మరి ఈ రెండు స్థానాలపై జగన్ ఫోకస్ చేసి సరైన నాయకుడుని పెడతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news