ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో… ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. మొన్నటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర దక్షిణ ఒడిస్సా ప్రాంతాలలో కేంద్రీకృతమైందని.. అల్పపీడనం కి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుండి 7.6 కిమీ వరకు కేంద్రీకృతమై ఎత్తుకు వెళ్ళే కొలదీ నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి స్థిరంగా కొనసాగుతూ ఉందని వెల్లడించింది.
‘ఈ తీవ్ర అల్ప పీడనం రేపటి లోగా పశ్చిమ & వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల ద్రోణి ఈ రోజు బికనుర్, భిల్వార్, ఇండోర్,భోపాల్,గొండియా, దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర దక్షిణ ఒడిస్సా లోని అల్పపీడనం, గోపాల్ పూర్ మీదగా తూర్పు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళా ఖాతం వరకు కొనసాగుతుందని వెల్లడించింది.దీంతో రేపు ఉత్తర మరియు పరిసర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యం లోనే తెలంగాణ రాష్ట్రంలో… ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.