హైదరాబాద్: వినాయక నిమజ్జనాలపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం?

-

హైదరాబాద్ లో గణేష్ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గణేష్ నిమజ్జనం గురించే. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాల వేడుకకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అదీగాక ఖైరతాబాద్ గణేశుడు ప్రత్యేక ఆకర్షణ. ఐతే హుస్సేన్ సాగర్ లో వినాయకులను నిమజ్జనం చేయడం సరికాదని, దానివల్ల నీటి కాలుష్యం జరుగుతుందని, బేబి పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేసింది.

బేబి పాండ్స్ ఏర్పాటు ఇప్పుడే సాధ్యం కాదని, అందువల్ల హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని రివ్యూ పిటీషన్ లో పేర్కొంది. ఈ పిటీషన్ పై హైకోర్టు నుండీ వెలువడిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. ఈ మేరకు ఈరోజు సుప్రీం కోర్టులో పిటీషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సంవత్సరం విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తామని, నిమజ్జనం జరిగిన 48గంటల్లో శుభ్రం చేసే బాధ్యత ప్రభుత్వానిదే అని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news