మాన‌వ‌త్వం.. రూ. 3.4 కోట్ల బిల్లు మాఫీకు దుబాయి ఆస్ప‌త్రి..! కానీ స్వ‌దేశంలో

-

బతుకుదెరువు కోసం.. పొట్ట చేతబట్టుకుని గ‌ల్ఫ్‌కు వెళ్లాడు జ‌గిత్యాల‌కు చెందిన ఓ వలస కార్మికుడు.
కానీ, ఊహించ‌ని కష్టం ఎదురయ్యింది. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ క్రమంలోనే అతడు కోమాలోకి వెళ్ళగా సుమారు ఆరు నెలల పాటు చిక్సిత పొందిన త‌రువాత కోలుకున్నాడు.

కానీ.. ఆస్ప‌త్రి బిల్లు మాత్రం త‌డిసి మోపాడయ్యింది. వేలు కాదు.. ల‌క్ష‌లు కాదు.. ఏకంగా రూ 3.40 కోట్లు బిల్లు అయ్యింది. దాంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న అతడి కుటుంబ‌ సభ్యులు సన్నిహితులకు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అండగా నిలిచింది. కోట్ల ఫీజు మాఫీ చేసింది మాన‌వత్వం చాటుకుంది దుబాయిలోని ఆస్పత్రి. కానీ..స్వదేశంలో అడుగుపెట్టిన ఆయనకు మాతృగడ్డ మీద చేదు అనుభవం ఎదురైంది. ఒక్కరోజు గడవకుండానే డబ్బు కట్టాలని డిమాండ్‌ చేసింది హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రి.

వివరాలలోకి వెళ్తే… తెలంగాణాలోని జగిత్యాల జిల్లా.. పెగడపల్లి మండలం సుద్దపెల్లి గ్రామానికి చెందిన కట్ల గంగారెడ్డి.. రెండేళ్ల క్రితం పొట్ట‌కూటికోసం దుబాయికి వెళ్లాడు. కానీ అనారోగ్యం కారణంగా డిసెంబర్ -2020 లో దుబాయ్ లో మెడ్‌క్లినిక్ సిటీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్ర‌మంలోనే ప‌క్ష‌వాతంతో కోమాలోకి వెళ్లాడు. దాదాపు ఆరు నెలల తరువాత కోమా నుంచీ బయటకు వచ్చారు.

అయితే మొత్తం చికిత్స కు రూ. 3.40 కోట్ల బిల్లు అయ్యింది. దీంతో అక్కడే ఉన్న గంగారెడ్డి కుమారుడు మణికంఠ, అతడి స్నేహితుడు ఇబ్రహీం కలిసి దుబాయ్‌లోని గల్ఫ్ కార్మికుల పరిరక్షణ సమితిని సాయం చేయాలిని కోరారు. ఇంత పెద్ద మొత్తంలో బిల్లు కట్టాలంటే అతడి శక్తి కి మించిన భారమ‌ని చెప్పారు. ఆ స‌మితి అధ్యక్షుడు గుండేళ్లి నరసింహ వెంటనే స్పందించారు. ఆ సమితి సభ్యులు ఆసుపత్రి యాజమాన్యంతోపాటు, యూఏఈలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి మొత్తం బిల్లును మాఫీ చేయించారు.

అంతేకాదు గంగారెడ్డి కోసం ప్రత్యేక ఎయిర్ అబులెన్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్ పంపి అక్కడి నుంచీ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అవసరమయ్యే రూ. 4.40 లక్షలు కూడా ఇప్పించారు. బిల్లు మాఫీ చేసిన ఆసుపత్రి యాజమాన్యానికి, ఇందుకు సహకరించిన పరిరక్షణ సమితికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

కానీ.. నిమ్స్ ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే చికిత్సకు అవసరమైన డబ్బును చెల్లించాల్సిందిగా
నిర్వాహకులు డిమాండ్‌ చేశారు. మాతృభూమిలో తాము నిస్సహాయులం అని బాధిత కుటుంబ వాపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news