విటమిన్-సి ఆరోగ్యానికి చాలా అవసరం అని మనకి తెలుసు. అయితే విటమిన్-సి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరు విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే విటమిన్ సి ఆరోగ్యానికి ఎంత ముఖ్యం అనేది చూస్తే..
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
విటమిన్ సి ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి. బ్యాక్టీరియాని తరిమికొట్టడానికి కూడా విటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది. త్వరగా గాయాలని మానిపించడానికి కూడా ఇది బాగా సహాయం చేస్తుంది.
క్రోనిక్ సమస్యల రిస్క్ తగ్గుతుంది:
విటమిన్ సి నిజంగా బెస్ట్ యాంటీఆక్సిడెంట్ అని చెప్పవచ్చు. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ని బాగా పెంచుతుంది. క్రోనిక్ సమస్యలను కూడా తగ్గిస్తుంది విటమిన్-సి.
ఐరన్ లోపం లేకుండా చూస్తుంది:
ఐరన్ అనేది మన బాడీకి చాలా అవసరం. ఎనిమియా సమస్యకి దారితీయకుండా ఉండాలంటే ఐరన్ చాలా అవసరం. విటమిన్ సి తీసుకోవడం వల్ల అది ఐరన్ ని అబ్జర్వ్ చేస్తుంది దీనితో ఐరన్ మన బాడీ లో ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది.
హృదయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి:
హైపర్టెన్షన్, చెడు కొలెస్ట్రాల్ మొదలైన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అదే విధంగా హృదయ సంబంధిత సమస్యలు రాకుండా విటమిన్ సి సహాయపడుతుంది.
స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది:
విటమిన్ సి తీసుకోవడం వల్ల చర్మ సమస్యలకి కూడా దూరంగా ఉండొచ్చు. అలానే జుట్టు పొడిబారిపోవడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలని కూడా విటమిన్-సి తగ్గిస్తుంది.