ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు గా కనిపిస్తున్న వారిలో ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ పింకీ కూడా ఒకరు. హౌస్ లో ఉన్న అమ్మాయిలు ఎంత అందంగా ఆకట్టుకుంటున్నారో అంతే అందం అభినయంతో ప్రియాంక అభిమానులను సొంతం చేసుకుంటుంది. తన ఆట తీరు మరియు మంచి తనంతో ప్రియాంక కు రోజు రోజుకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో పింకీ ఎంతో ఎమోషనల్ అయ్యింది.
ఫస్ట్ లవ్ గురించి కంటెస్టెంట్ లు చెప్పాలని బిగ్ బాస్ కోరగా ఒక్కొక్కరూ తమ ఫస్ట్ లవ్ ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక కూడా తన మొదటి ప్రేమను గుర్తు చేసుకుని ఎంతో ఎమోషనల్ అయ్యింది. తాను ఒకతని బండి వెనక పరిగెత్తేదానిని అని కానీ అతడు కనీసం తిరిగి వెనక్కి కూడా చూడలేదని చెబుతూ ప్రియాంక కంటతడి పెట్టుకుంటుంది. దాంతో ఇంటి సభ్యులు ప్రియాంకను ఓ దార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ప్రోమో కామెంట్స్ లో కూడా ప్రియాంకపై నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు.