హైదరాబాద్ ప్రజలకు శుభవార్త… అభివృద్ధికి రూ.3866 కోట్లు మంజూరు

-

హైదరాబాద్ లోని 31 సివరెజి ప్లాంట్ల నిర్మాణం కోసం 3866 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. జిహెచ్ఎంసితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే పదేళ్లలో పెరిగే సివరెజిని దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టబోతున్నామని వెల్లడించారు మంత్రి కేటీఆర్. ఇవాళ హైదరాబాద్ అభివృద్ది పై మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భాంగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో 90 శాతం తాగునీటి సమస్యను పరిష్కారం చేసిందని.. తెలంగాణ సర్కారు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తోందన్నారు. జీహెచ్ఎంసితొ పాటు ఓఅర్ఆర్ లోపల 1950 MLD మురికినీరు ఉత్పత్తి అవుతుందని.. జీహెచ్ఎంసిలో 1650 MLD మురికి నీరు ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు.

చెరువులు,మూసి బాగు చేయాలని కేసీఆర్ సంకల్పమని.. చెరువులు,మూసి బాగుపడాలంటే హైదరాబాద్ లో మురికినీరు ను 100 శాతం ట్రీట్ మెంట్ చేయాలని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. జీహెచ్ఎంసి పరిధిలో 100 శాతం మురికినీరు ట్రీట్మెంట్ కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఓఅర్ఆర్ లోపల ప్రాంతాల్లో నీటి అవసరాల కోసం 12 వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని.. మంచి నీళ్ళు, మురుగు నీటి శుద్ధీకరణను ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news