టీఆర్‌ఎస్ పార్టీ లో మరోసారి గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డి పై కేసీఆర్, కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి. తన పై మంత్రి మల్లారెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారని, జిల్లాలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి.
అయితే… ఇప్పుడు అందరూ కలిసి మెలిసి పార్టీ బలోపేతం కోసం పని చేయాలని ఈ సందర్భంగా సర్ది చెప్పారు సీఎం కేసీఆర్. ఢిల్లీ పర్యటన ముగిసిన తరువాత మరోసారి మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్ నేతలతో సమావేశం అవుతానని నేతలుకు చెప్పారు సీఎం కేసీఆర్. ఇక అనంతరం మేడ్చల్ జిల్లా లో నాయకుల మధ్య మంత్రి మల్లారెడ్డి గొడవలు పెడుతున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు మేడ్చల్ జెడ్పీ చైర్మన్. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని కేటీఆర్ చెప్పారని ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి. తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నానని శరత్ చంద్రారెడ్డి స్పష్టం చేశారు.