తెలంగాణ ఎమ్యెల్యేలకు హైదరాబాద్ లో క్లబ్ : సిఎం కెసిఆర్

-

ఇవాళ జరిగిన బీఏసీ {తెలంగాణ శాసనసభ వ్యవహారాల సలహా సంఘం}లో సమావేశం లో సీఎం కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యేలందరికీ క్లబ్ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని కాన్ స్టి ట్యూషన్ తరహాలోనే దీనిని నిర్మిస్తామని స్పష్టం చేశారు. సభ్యులు చర్చకు ఇచ్చే అంశాలను బట్టి సభ్యులు కోరినన్ని రోజులు శాసనసభ నిర్వహించాలని.. గతంలో కరోనా కారణంగా తక్కువ రోజులు, ప్రస్తుతం మహమ్మారి అదుపులో ఉండటంతో సభను ఎక్కువ రోజులు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయం ఉంచాలని.. జీరో అవర్లో సభ్యులకు అవకాశం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తరఫున ఐటీ, ఇండస్ట్రీ, హరితహారం అంశాలపై చర్చ జరుగుతుందని… బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సీఎం సూచనలు చేశారు.

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చేరవేయాలని.. అర్ధవంతమైన, ముఖ్యమైన అంశం అయితే కావలసినంత సమయం కేటాయించాలని సీఎం కెసిఆర్ వెల్లడించారు.  తెలంగాణా అసెంబ్లీలో కొత్తగా కొన్ని నిబంధనలను, విధివిధానాలను రూపొందించుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలని.. కొత్త రాష్ట్రం ఐనప్పటికీ నిర్వహణలో తెలంగాణా శాసనసభ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news