సీఎం కేసీఆర్‌ బండి సంజయ్‌ మరో బహిరంగ లేఖ.. బీసీ బంధును అమలు చేయాల్సిందే !

-

సీఎం కేసీఆర్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ మరో బహిరంగ లేఖ రాశారు. బీసీల ఎదురుకొంటున్న సమస్యల పై ముఖ్యమంత్రి కెసిఆర్ కు 7 పేజీల బహిరంగ లేఖ రాశారు బీసీ బంధు ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి అర్హులైన ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి 10 లక్షలు ఆర్ధిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. జనాభాలో 50 శాతానికి పైగా వున్న బీసీల సంక్షేమం కోసం బీసీ బంధు పథకం ప్రారంభించాలిసిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వాన్ని కోరారు.

బీసీల పై తెరాస ప్రభుత్వం సవతి తల్లి ప్రేమవిడనాడాలని డిమాండ్ చేసిన బండి సంజయ్…
తెరాస ప్రభుత్వం హయంలో అటకెక్కిన బీసీ సబ్ ప్లాన్ అన్ని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ ను ప్రవేశపెట్టి దానికి చట్ట భద్రత కల్పించాలన్నారు. 46 బీసీ కులాలకు నిర్మిస్తామన్న ఆత్మ గౌరవ భవనాలకు అడ్రస్ లేదని ఫైర్‌ అయ్యారు.

3400 కోట్ల ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలను వెంటనే విడుదల చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బండి సంజయ్. చేనేత కార్మికులకు భీమా , హెల్త్ కార్డులు మంజూరి చెయ్యాలని అలాగే…. గీత కార్మికులను ఆదుకోవడాని వెంటనే గీత కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు గాయపడిన గీత కార్మికులకు 4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. దోబీఘాట్ ల నిర్మాణాలు, నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల కరెంటు ను ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. ఎంబీసీ కార్పొరేషన్ కు సమృద్ధిగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news