ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు/పశ్చిమ గాలులు వీస్తున్నాయి. నిన్నటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి ఈ రోజు గాంజెటిక్ పశ్చిమ బెంగాల్ యొక్క పశ్చిమ ప్రాంతాలు మరియు దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉంది. ఈ తీవ్ర అల్పపీడనం యొక్క ప్రభావము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
rain
వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.