గత కొన్ని నెలలుగా తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి పెద్ద ఎత్తున చర్చలు నడిచిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈటల రాజేందర్ టిఆర్‌ఎస్ నుంచి బయటకు రావడం, ఎమ్మెల్యేకు పదవికి రాజీనామా చేయడం చేశారో అప్పటి నుంచి హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు తెరపైకి వచ్చింది. వెంటనే బిజేపిలో చేరిన ఈటల…హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలిచి టిఆర్‌ఎస్‌కు చెక్ పెట్టాలని అనుకున్నారు.
ఒక అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీలో చేరి సత్తా చాటాలని అనుకుంటున్న ఈటలకు….టిఆర్‌ఎస్ పార్టీ గట్టి షాక్ ఇవ్వాలని అనుకుంటుంది. అందుకే ఎప్పుడూలేని విధంగా కొత్త పథకాలు కూడా తీసుకొచ్చింది. కేసిఆర్, హరీష్ రావు దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు…ఇలా ప్రతి ఒక్క టిఆర్‌ఎస్ నేత హుజూరాబాద్‌లో మకాం వేసి ఈటలని ఓడించాలని తిరుగుతున్నారు. అలాగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు..కులాల వారీగా మీటింగులు పెట్టి, వారికి ఆర్ధిక సాయం చేస్తున్నారు. ఇలా ఒకటి ఏంటి అనేక రకాలుగా హుజూరాబాద్ ప్రజలని ఆకట్టుకుని ఈటలకు చెక్ పెట్టాలని టిఆర్‌ఎస్ చూస్తోంది.
ఇదే సమయంలో ఉపఎన్నిక త్వరగా జరగకుండా బాగానే ప్లాన్ చేసుకుంది. అంటే ఉపఎన్నిక ఎంత లేట్ అయితే…అంతగా ఈటల మీద సానుభూతి తగ్గుతుందని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఉపఎన్నిక త్వరగా జరగలేదు. అయితే తాజాగా ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 30న ఎన్నిక, నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది. అంటే మరో నెల రోజుల్లో ఎన్నిక జరగనుండటంతో మళ్ళీ హుజూరాబాద్‌లో రాజకీయం రంజుగా మారింది.
ఈటల-టిఆర్‌ఎస్‌ల మధ్య మళ్ళీ రగడ మొదలైంది. అటు కాంగ్రెస్ సైతం తమ అభ్యర్ధిని ప్రకటించడానికి సిద్ధమైంది. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో హుజూరాబాద్ లో మెజారిటీ ప్రజలు ఇంకా ఈటల వైపే ఉన్నారని తెలుస్తోంది. టిఆర్‌ఎస్ ఎన్ని చేసినా అక్కడి ప్రజలు మాత్రం ఈటలపై సింపతీనే ఉన్నారని తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం హుజూరాబాద్‌లో ఈటలదే లీడింగ్.