”జగనన్న స్వచ్ఛ సంకల్పం” కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్.. అందుబాటులోకి 4,097 చెత్త సేకరణ వాహనాలు

-

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జగన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్‌ ఆంధ్ర ప్రదేశ్‌ కార్యక్రమం ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ సంకల్పం , క్లిన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ బెంజ్ సర్కిల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్… మొదట గా… మహాత్మా గాంధీ , లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

jagan
jagan

అనంతరం గార్బేజ్ టిప్పర్ వాహనాన్ని, హై ప్రెజర్ క్లినర్ లను పరిశీలించారు సీఎం జగన్. క్లాప్ కార్యక్రమ ప్రచార సీడీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్.. అనంతరం స్వచ్ఛ భారత్ లక్ష్యంగా పారిశుధ్య నిర్వహణకు స్వచ్ఛ సంకల్పం, క్లిన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే… 4,097 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు సీఎం జగన్. ఈ చెత్త సేకరణ వాహనాలకు 13 జిల్లాల కార్మికుల అందజేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news