కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో జైల్లో ఉన్న మోనితతో దీప మాట్లాడుతూ ఉంటుంది. నేనుండగా నువ్వు నా భర్తను పొందటం అసాధ్యం అని దీప అంటే..మోనిత మనిషికి అసాధ్యం అనేది ఉండదు దీపక్కా అంటుంది. దీప..సాక్ష్యాలు మాయం చేయగలవేమోగాని…ఈ కేసు అలాగే ఉంది.. హిమ కేసు తిరగతోడిస్తాను, అంజి ఎక్కడున్నా పట్టుకొస్తాను,నీకు శిక్ష పడేలా చేస్తాను అంటుంది. ఈ మాటలకు మోనిత ఏ మాత్రం భయపడదు..సాక్ష్యాలు మాయం చేశాను..అంజి ఇక తిరిగిరాడు అని నేను కాని క్రిమినల్ బ్రెయిన్ తో ఆలోచిస్తే నీ కుటుంబం ఏమవుతుందో తెలుసుగా నేను బ్రాడ్ మైండ్ తో ఆలోచించి ఏం చేయటం లేదు అంటుంది. దీపకు మోనిత మాటలకు కోపం వస్తుంది..పేపర్ లో రాతలు ఆపేయ్, వాటిని పిల్లలు చూస్తే డాక్టర్ బాబుని నిలదీస్తారు అంటుంది. అలాంటప్పుడు పిల్లలకు నిజం చెప్పేయ్..మోనిత మీ పిన్ని త్వరలోనే మీకో తమ్ముడు రాబోతున్నాడు అని చెప్పేయ్..మ్యాటర్ ఓవర్ అంటుంది మోనిత. దీప..మోనిత ప్లీజ్..ఇప్పటివరకు డాక్టర్ బాబు పడ్డ నిందలు, అవమానాలు చాలు ఆపేయ్ అంటుంది. మోనిత..నిందలు, అవమానాలు నీ కంటే నా అకౌంట్లోనే ఎక్కువ ఉన్నాయ్..అన్నీ పడ్డాను.కేవలం మన కార్తీక్ కోసం.అండర్ లైన్ చేసుకో మన కార్తీక్..కార్తీక్ అంటే నాకు ప్రేమ,పిచ్చి అని కార్తీక్ మీద తనకున్న ప్రేమను చెప్తుంది.
ఈ వంటలక్క మాత్రం వీరలెవలో ఎక్సప్రెషన్స్ ఇస్తుంది. మోనిత మీరందరు నన్ను ఒక క్రూరమృగంలా చిత్రీకరించారు..నన్ను ఒక చెడ్డదానిలా లోకానికి చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు..నేను చెడ్డదాన్ని కాదు..ఓ గొప్పు ప్రేమికురాలిని, మీకు అర్థంకాదు..మీకు అర్థంకాకపోతే..అర్థమయ్యే భాషలో చెప్పాను..చూశావా పేపర్ చూడగానే పొలోమని పరిగెత్తుకుంటూ వచ్చావ్.అవమానాలకు అందమైన ప్రతీకారం పేపర్ లో వార్త దీపక్కా..అంటూ సాగిదీస్తుంది. దీప మాటలు చాలా ఎక్కవ మాట్లాడుతున్నావ్..అని మళ్లీ చెప్పిన సోదే చెప్తుంది దీప..ఇవన్నీ ఆపేయ్..ఆ పేపర్లో రాతలు మానేయ్ అంటూ..మోనిత ఆపేస్తాను, నీ జోలికే రాను నా మెడలో కార్తీక్ తో తాళికట్టించు.అన్ని ఆపేస్తాను, డీల్ ఓకే నా..నీ ఇష్టం అక్క..ఈ సమస్యకు ఈ ప్రపంచంలో ఇంత సింపుల్ అండ్ స్వీట్ సొల్యూషన్ ఇంక ఎవ్వరూ ఇవ్వలేరు..మోనిత ఇలా కార్తీక్ పై ప్రేమను చెబుతూ..దీపకు మండేలా మాట్లాడుతుంది. దీప ఏం మాట్లాడకుండా ఆ మోనిత చెప్పే మాటను వింటూ ఉంటుంది. ఈ సీన్ పిచ్చ ల్యాగ్ ఉంటుంది. మోనిత ఫైనల్ గా డీల్ ఓకే అయితే చెప్పు..హ్యాపీ, డీల్ నచ్చకపోతే కూడా హ్యాపీ, నేను చేసేది చేస్తాను అంటుంది. ఇంతలో సుకన్య వస్తుంది. తనకి ఒక ఆపిల్ ఇచ్చి మా అక్కే తెచ్చింది అంటుంది. బాయ్ దీపక్కా, మన కార్తీక్ ని అడిగానని చెప్పు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్పి వెళ్లిపోతుంది. దీప కూడా కోపంగా వస్తుంది.
ఇటువైపు హిమ ఒక్కతే ఆరోజు షైనీ అన్న మాటలను, పేపర్ లో చూసిన వార్తను తలుచుకుని పరిపరివిధాల ఆలోచిస్తూ ఏడుస్తుంది.ఇంతలో శౌర్య చూసి వస్తుంది. ఇక్కడేం చేస్తున్నాం ఒంటరిగా అంటుంది శౌర్య. హిమ ఏడుస్తూ..బాధగా ఉంది అంటుంది. శౌర్య నా కూడా అంటుంది. కానీ ఏం చేస్తాం చెప్పు, ఎవ్వరూ సమాధానం చెప్పరు అని బాగా కష్టాలొచ్చిప్పుడు మనం సంతోషంగా ఉన్న రోజులు గుర్తుచేసుకోవాలంట అని చెప్తుంది. హిమ నీకు బాధలేదా అంటుంది. ఉంది కానీ నువ్వు మళ్లీ బాధపడితే నీకు జ్వరం వస్తుంది..అందుకనే చెప్తున్నా అంటుంది శౌర్య..ఆ మాటకు హిమ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది. శౌర్య కూడా షైని చెప్పింది నిజమా అబద్ధామా..అబద్ధమైతే పేపర్లో ఎందుకు వచ్చింది అనుకుంటుంది.
మరోసీన్ లో ఆదిత్య ఫోన్ లో మాట్లాడుతూ వస్తాడు. సౌందర్య కాఫీ తాగుతూ..ఏంట్రా ఫోన్లో ప్రాబ్లమ్ అంటున్నావ్ అంటే మా ఫ్రెండికి ఒక సమస్య ఉందంటే తీరుస్తాను అంటున్నాను అంటాడు. ఆ మాటకు సౌందర్య నవ్వి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ఈ ఇంట్లో నువ్వు వేరే వాళ్ల సమస్యలు తీరుస్తా అంటున్నావ్ అని బేలగా మాట్లాడుతుంది.. స్వప్న కోపంతో సౌందర్య బాధపడుతుంది. అలా కాసేపు మాట్లాడుకుంటారు. ఆదిత్య వదిన ఏదో పేపర్ కనిపించటం లేదంది, ఆ విషయం అన్నయ్యకి చెప్పొద్దు అంది, ఏం పేపర్ మమ్మీ అది అంటాడు. సౌందర్య జరిగింది చెప్తుంది. ఆ పేపర్ ని పిల్లలు కానీ చదివారంటే అని సౌందర్య భయపడుతుంది. ఆదిత్య పిల్లలకు ఓపెన్ గా చెప్తే సరిపోతుందిగా , వాళ్లు ఎదుగుతున్నారు కదా అంటాడు . ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే..కార్తీక్ వచ్చి మమ్మీ పిల్లలు కనిపించటం లేదు అంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.