బద్వేల్ స్పెషల్: చమురు క్షేమమే టీడీపీ కారణమా?

-

కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన సమావేశమైన టీడీపీ పోలిట్ బ్యూరో.. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. సంప్రదాయాలను గౌరవించి బద్వేల్ లో పోటీ చేయడం లేదని టీడీపీ వెల్లడించింది. అయితే అదే మేజర్ కారణం కాదనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తుంది!

TDP
TDP

అవును… బద్వేల్ ఉప ఎన్నికకు దూరంగా ఉండటానికి “సాంప్రదాయం” ఒక సాకుమాత్రమే అని.. అందుకు సరైన కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. నిజంగా బాబుకు ఆ ఆలోచనే ఉండి ఉంటే… బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ ను టీడీపీ ఎందుకు ఖరారు చేసినట్లు.. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఆ సాంప్రదాయం ఎందుకు గుర్తొచ్చినట్లు? అనే ప్రశ్నలు వేస్తున్నారు!

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో అధికార పార్టీకి ఉన్న బలం విపక్షానికి ఏమాత్రం లేదనేది బాబు సైతం ఎరిగిన సత్యం! పైగా… కడప జిల్లాలో అధికార వైసీపీని కాదని పోటీ చేసినా.. విజయాన్ని సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ మెజారిటీ తగ్గించొచనే ఉద్దేశ్యంతో పోటీ చేసినా కూడా… చేతిలో చమురు వదల్చుకోవటం తప్ప మరో ప్రయోజనం లేదు! పోలిట్ బ్యూరోలో వచ్చిన నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే అనేది విశ్లేషకుల అభిప్రాయం!

దీనికి తోడు.. బద్వేల్ ఉప ఎన్నికలో టీడీపీకి 2019లో వచ్చిన ఓట్లకంటే తక్కువగనుక వస్తే.. అది ఇంకా దారుణంగా ఉంటుంది! పార్టీ క్యాడర్ మరింత దిగాలు పడిపోతుంది. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ నెలాఖరు నుంచి ప్రజలోకి వెళ్లాలని భావిస్తున్న బాబు కు బోలెడు ఖర్చు ముందుండగా… వృథాగా బద్వేల్ లో చమురు వదిలించుకోవడం మంచిది కాదనేది శ్రేయోభిలాషుల మాట అంట! దీంతో… సంప్రదాయం మాటున బాబు & కో బద్వేల్ కు దూరంగా ఉండాలని ఫిక్సయ్యారంట!

Read more RELATED
Recommended to you

Latest news