నలభై ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా దిగజారిపోతున్నట్లు కనిపిస్తోంది. గత దశాబ్ద కాలం నుంచి టిడిపి ఊహించని విధంగా దెబ్బతింది. ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మునిగిపోయింది. అక్కడ అడ్రెస్ లేకుండా పోయింది. సరే ఏపీలో అయినా పార్టీ ఉందనుకునే లోపే….పార్టీ పరిస్తితి దిగజారుతూ వస్తుంది. 2019 ఎన్నికల్లో ఏపీలో కూడా పార్టీ దారుణంగా ఓడిపోయింది. అక్కడ నుంచి పార్టీ పరిస్తితి ఘోరంగా తయారైంది. జగన్ దెబ్బకు పార్టీ చాలా వరకు దెబ్బతింది. ఇక చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ని పైకి లేపే క్రమంలో పార్టీని కింది స్థాయికి వెళ్ళేలా చేస్తున్నారు.
దీంతో ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. ఇలాంటి సమయంలో పార్టీని పైకి తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబుది. కానీ ఆ కార్యక్రమం బాబు చేస్తున్నట్లు లేదు…జగన్‌ని ఎదురుకోవడం చేతగాక, పవన్ కల్యాణ్‌ని ముందుపెట్టి రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పవన్ ఎలాగో దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఇక పవన్‌ని అడ్డం పెట్టుకుని పబ్బం గడపాలని బాబు చూస్తున్నట్లు ఉన్నారు.
నెక్స్ట్ ఎన్నికల్లో పవన్‌ని కలుపుకుని గెలవాలని చూస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్‌లో చంద్రబాబు, టిడిపిని నాశనం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ విషయం ఇటీవల బాగా అర్ధమవుతుంది. బద్వేలు ఉపఎన్నికలో ముందు పోటీ చేయాలని ఫిక్స్ అయ్యి అభ్యర్ధిని కూడా డిసైడ్ చేసుకుని కూడా పవన్ కల్యాణ్ …జనసేన తరుపున పోటీ పెట్టడం లేదని చెప్పిన తర్వాత…చంద్రబాబు కూడా తాము పోటీ చేయడం లేదని ప్రకటించారు.
ఇలా పవన్ ఏది చేస్తే…బాబు కూడా అదే చేశారు. ఇక రానున్న రోజుల్లో పవన్ బట్టే రాజకీయం చేసేలా ఉన్నారు. అయితే ఇదే కంటిన్యూ చేస్తే జనాలు కూడా బాబుని సైడ్ చేసి పవన్ కల్యాణ్‌ని ఆదరించే ఛాన్స్ కూడా లేకపోలేదు. అప్పుడు టిడిపి మూడో స్థానంకు వచ్చి, జనసేన రెండో స్థానంలోకి వస్తుంది. అంటే బాబు పరోక్షంగా టిడిపిని ముంచుతున్నట్లు కనిపిస్తోంది.