భూమిలో బంగారం అని చెప్పి.. లక్షల్లో కాజేసిన మోసగాడు.. లబోదిబోమంటున్న వ్యాపారి

-

బంగారం…365 రోజులు డిమాండ్ ఉండే వ్యాపారం..బిజినెస్ లో లాభాలే కానీ, నష్టాల మాటే ఉండదు. అలాంటి ఓ బంగారం వ్యాపారం చేసి వ్యక్తి ఏకంగా 15లక్షలు మోసపోయాడు. మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుని చివరికి పోలీసులను ఆశ్రయించాడు..ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లా చెందిన వ్యాపారి శ్రీనివాసులుకు కర్ణాటకు చెందిన గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలో పడి మోసపోయాడు. తన పొలంలో బంగారం లభించిందంటూ ఆ వ్యక్తి చెప్పిన మాటలను ఈ వ్యాపారి నమ్మాడు… ఆ బంగారాన్ని అమ్మిపెట్టాలని లేదంటే తక్కువ ధరకు అమ్ముతా అని బంగారం వ్యాపారికి చెప్పాడు. మొదట ఈ వ్యాపారి ఆ మాయగాడి మాటలు ముందుగా నమ్మలేదు. అయినా ఆ మోసగాడు వెంటపడ్డాడు. ఒక్కసారి వచ్చి బంగారన్ని చూడాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఆ వ్యాపారి ఒకసారి చూసి వస్తే ఏమైతదిలే అనుకుని కర్ణాటకకు వెళ్లాడు.
అయితే చెప్పినట్టుగానే ఆ మోసగాడు.. బంగారంతో కూడిన చైన్‌లు కొన్నింటిని చూపించాడు.అయినా నమ్మని బంగారు వ్యాపారి వాటిలో కొన్నింటిని గద్వాలకు తీసుకువచ్చి పరీక్షించాడు. దీంతో అది నిజమైన బంగారంగా నమ్మాడు. ఇప్పుడు మొదలైంది అసలు కథ..
దీంతో ఆ వ్యక్తి అరకిలో బంగారం ఇస్తానని అందుకు కోసం రూ 15 లక్షలు తీసుకురావాలని దాన్ని విక్రయించిన తర్వాత బంగారం ఇస్తానని చెప్పాడు. దావనగిరికి రమ్మని చెప్పడంతో నమ్మిన శ్రీనివాసులు తన మిత్రుడు గోవర్ధన్ ‌తో కలిసి మరోసారి వెళ్లారు. అప్పటికే సినిమాలెవల్లో మనుషులు పెట్టి పక్క ప్లాన్ తో ఉన్నాడు ఆ కర్ణాటక వాసి. ఎప్పుడు ఈ వ్యాపారి డబ్బుతో వచ్చాడో.. రూ. 15 లక్షలు గుంజుకుని ఇద్దరి పై దాడికి పాల్పడ్డాడు. అనంతరం గద్వాలకు వచ్చిన వ్యాపారి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆశకు పోయి ఉన్న డబ్బుును పోగొట్టుకున్న వ్యాపారి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news