ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా. కాసేపటి క్రితమే.. జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణం చేయించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్.

విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం లో ఈ ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం కార్యక్రమం నేపథ్యం లో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరియు పలువురు ప్రజా ప్రతినిధులు, న్యాయ మూర్తులు, అధికారులు హాజరు అయ్యారు.

కాగా మధ్యప్రదేశ్ మరియు చత్తీస్ ఘడ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా… 2005 సంవత్సరం జనవరి మాసంలో సీనియర్ న్యాయవాదిగా హోదా సంపాదించారు. ఆ తర్వాత చత్తీస్ ఘడ్ బార్ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ కుమార్ మిశ్రా… హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 సంవత్సరంలో చత్తీస్ ఘడ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక తాజాగా ఏపీ హైకోర్టు సీజే గా నియామకం అయ్యారు ప్రశాంత్ కిషోర్ మిశ్రా.

Read more RELATED
Recommended to you

Latest news