అలర్ట్ : రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ లో వ్యాక్సినేషన్ బంద్

-

తెలంగాణ రాష్ట్రం లో రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కు బ్రేక్‌ పడనుంది. బతుకమ్మ మరియు దసరా పండుగ నేపథ్యంలో.. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కు తాత్కాలిక బ్రేక్‌ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తో రేపటి నుంచి అంటే… 14 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు వాక్సినేషన్ ప్రక్రియ ఉండదన్న మాట.

దసరా మరియు బతుకమ్మ పండుగల నేపథ్యంలో సెలవులు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు, 14 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాగా.. తెలంగాణ రాష్ట్రం లో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజు కు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news