తెలుగు రాష్ట్రాలకు మరోమారు వర్ష ముప్పు పొంచి ఉంది. మరోమారు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొట్టనున్నాయి. ఈ నెల మొదట్లో గులాబ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. తాజాగా అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఏపీలలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా ఉత్తర తెలంగాణ మీద అల్పపీడనం ఏర్పడి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వానలు కురవనున్నాయి. తెలంగాణ ప్రాంతంలో మొస్తారు వానులు కరుస్తాయని, కోస్తాంధ్ర , రాయల సీమల్లో తేలికపాటి వర్షాలు కురువనున్నాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ హెచ్చిస్తోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. తాజగా తెలుగు రాష్ట్రాలకు వర్షం పోంచిఉండటంతో రానున్న రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
-