Mukku Avinash: బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు పుల్ స్టాప్ పెట్ట‌బోతున్న జబర్దస్త్ కామెడియ‌న్.. ఫోటోలు వైర‌ల్ !

-

Mukku Avinash: జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లి తెర‌పై క‌నిపించి న‌వ్వుల పువ్వులు పూయించారు ముక్కు అవినావ్. చిన్న కంటెస్టెంట్గా జ‌బ‌ర్థ‌స్ లోకి వ‌చ్చి.. టీం లీడ‌ర్ గా ఎదిగాడు. తనకంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ముక్కు అవినాష్. అలాగే.. అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. వెండి తెర‌పై న‌టించి మెప్పించారు. ప‌లు సినిమాల్లో క‌నిపించారు. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ త‌న ఇంటి త‌లుపు త‌ట్టారు. వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ లోకి ఏంట్రీ ఇచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించారు.

ఇప్ప‌డూ ఈ కామెడియ‌న్ ఇంటి వాడు కాబోతున్నాడు. త‌న ఇంట పెళ్లి గంట‌లు మోగుతున్నాయి. ఇటీవలే అనుజ అనే అమ్మాయితో ముక్కుఅవినాష్ కు నిశ్చితార్థం అయింది. ఆ అమ్మాయిని టీవీ షోకి కూడా తీసుకొచ్చి అందరికి పరిచయం చేశాడు. అవినాష్‌ మరికొద్ది గంటల్లో పెండ్లి పీట‌ల మీద ఎక్క‌బోతున్నాడు.

ఇప్పటికే త‌న స్వ‌స్థలంలో పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. పెళ్లి వేదికల్లో భాగంగా సోమవారం అవినాష్‌ స్వస్థలంలోనే హల్దీ ఫంక్షన్ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు టీవీ నటులు సహా నెటిజన్ల నుంచి అవినాష్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న పెళ్లికి జబర్దస్త్ తో పాటు మరి కొంతమంది టీవీ నటులు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news