తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై టీఆర్‌ఎస్ పార్టీ వర్కంగ్ ప్రెసిడెంట్, మంత్రి వర్యులు కేటీఆర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో మంగళవారం ఉదయం జర్నలిస్టులతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ లో బీజేపీ, మరియు కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.
ఈటల రాజేందర్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్ధిని నిలబెట్టిందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్ లో డిపాజిట్ తెచ్చు కోవాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ ను పార్టీ లోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసిందని ఆరోపణలు చేశారు కేటీఆర్. ఈటల రాజేందర్ ఎవరిని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని… ఈటల రాజేందర్ తన బాధ ప్రపంచ బాధ అనుకుంటున్నారని చురకలు అంటించారు. జానారెడ్డి కంటే పెద్ద నాయకుడా ఈటలా ? బీజేపీని ఈటల ఎందుకు ఓన్ చేసుకోవడం లేదని ప్రశ్నించారు.