మహిళలు చిన్నారులపై లైంగిక వేధింపులకు చెక్ పెట్టేందుకు సర్కార్ కీలక నిర్ణయం..!

-

తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితులకు కఠిన శిక్షలు విధించినా మృగాల్లో మార్పు రావడం లేదు. ఇటీవల హైదరాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన దారుణం దేశవ్యాప్తంగా సంచలనం గా మారింది. ఆ ఘటన జరిగిన తరవాత కూడా రాష్ట్రంలో అనేక చోట్ల చిన్నారులపై దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఇక మహిళలపై జరుగుతున్న దారుణాలకు లెక్కే లేదు.

ఈ నేపథ్యంలో లో మహిళలు చిన్నారుల పై లైంగిక వేధింపులకు అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వేధింపులను అరికట్టేందుకు సైబర్ ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ ల్యాబ్ లు అందుబాటులోకి రానున్నాయి. సోషల్ మీడియా ద్వారా…సెల్ ఫోన్ నుండి వచ్చే వేధింపులను సైబర్ ల్యాబ్ పసిగడుతుంది. ఈ ల్యాబ్ రాష్ట్రం లో ఉన్న పోలీస్ స్టేషన్ లకు సాంకేతిక సహకారం అందించనుంది. అంతే కాకుండా మహిళలు..చిన్నారుల అక్రమ రవాణా ను పసిగట్టనుంది.

Read more RELATED
Recommended to you

Latest news