PUSHPA : బన్నీ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. సామి… సామి సాంగ్ వచ్చేసింది

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్… తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల కాంబినేషన్ లో హై ట్రిక్ సినిమాగా పుష్ప తెరకెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతున్నది. ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌. పార్ట్ వన్ పుష్ప… డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుంది. ఇక వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తూ స్ట్రాంగ్ క్రియేట్ చేస్తోంది పుష్ప మూవీ యూనిట్. ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి సాంగులు విడుదలై… యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇక తాజాగా మూడో సింగిల్ ” సామి సామి ” పూర్తి పాట ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటలో రష్మిక మందన మరియు అల్లు అర్జున్ పర్ఫామెన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా రష్మిక డాన్స్ ఈ పాటకు హైలెట్ గా నిలిచింది. అలాగే లిరిక్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news