Kandikonda: కందికొండ కోసం.. సింగ‌ర్ స్మిత సాయం

-

Kandikonda: తెలంగాణ సంస్కృతి, సంప్రాదాయాలు, యాస, భాషను ప్రపంచానికి ప‌రిచ‌యం చేయ‌డంతో త‌న వంతు ప్రయ‌త్నం చేసిన వ్య‌క్తి సినీ గేయ రచయిత డాక్టర్‍ కందికొండ యాదగిరి. తెలంగాణ ప‌ల్లే పాట‌లకు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం కల్పించిన రచయిత‌. అటు క్లాస్ అయినా.. ఇటు మాస్ అయినా.. త‌న‌దైన శైలిలో పాట‌కు ప్రాణ పోసే ర‌చ‌యిత‌.. కందికొండ.

ఇంకా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కవి.. గేయ రచయిత కందికొండ పనిచేశారు. వందలాది పాటలను అందించిన ప్రముఖ సినీ గేయ రచయిత ప్ర‌స్తుతం ఆరోగ్యపరంగా కష్టాల మీద కష్టలొచ్చిపడుతున్నాయి. గ‌త రెండేళ్లుగా ఆయ‌న క్యాన్సర్‍తో పోరాడుతున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. అయితే.. ఆయ‌న పూర్తిగా కోలుకోవాలంటే.. వెంటనే మరో ఆపరేషన్‍ చేయాలని.. లక్షల్లో ఖర్చవుతుందని తేల్చి వైద్యులు చెప్పారు. దీంతో ఆ కుటుంబం మరోసారి చేయూత కోసం ఎదురుచూస్తోంది.

ఇప్పటికే కోన వెంకట్ వంటి ప్రముఖులు కందికొండకు సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.. ఈ క్రమంలో సింగర్ స్మిత.. కందికొండకు సాయం చేసినట్లుగా తెలుస్తోంది. కంది కొండ ఆప‌రేష‌న్ ఖ‌ర్చుల‌న్నీ త‌నే భ‌రించారు. బుధ‌వారం హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో కందికొండ‌కు ఆప‌రేష‌న్ జ‌రిగింది. ఆ ఆప‌రేష‌న్ బిల్లు స్మిత చెల్లించారు. ఆప‌రేష‌న్ కి దాదాపుగా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌య్యింద‌ని స‌మాచారం.

కందికొండ త్వ‌ర‌లోనే పూర్తి స్థాయిలో కోలుకుంటార‌ని, క‌నీసం నెల రోజుల్లో మునుప‌టి కందికొండ‌ని చూడొచ్చ‌ని కందికొండ కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా స్మిత‌కు వాళ్లు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news