తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మరియు తెలంగాణ కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ మాట తప్పారని ఫైర్ అయ్యారు. దిండి, పాలమూరు వంటి ప్రాజెక్టుల్లో తాగు నీరు పేరు తో సాగుకు నీళ్లు మళ్ళించారని ఆగ్రహించారు. మాకు కేటాయించిన నీళ్లకు అదనంగా చెంచాడని.. నీళ్లు కూడా వాడమని ఎప్పుడో చెప్పామని గుర్తు చేశారు మంత్రి పేర్ని నాని.
రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ కు ఎంత దూరమో విజయవాడ నుంచి హైదరాబాద్ కు అంతే దూరమని స్పష్టం చేశారు పేర్ని నాని. రాజకీయ శూన్యత వల్లే తెలంగాణ రాష్ట్రం లో కొత్త పార్టీలు పుట్టుకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
151 స్థానాలు వచ్చిన తర్వాత ఏపీలో శూన్యత ఎక్కడ ఉంటుంది ? అని ప్రశ్నించారు. మా సంక్షేమ పథకాల వల్ల ప్రజల మనసుల్లో శూన్యత లేదన్నారు. ఇక అటు రేవంత్ రెడ్డి ట్వీట్ పై మంత్రి పేర్ని నాని స్పందించారు. రోజు రాజకీయాల్లో ఉండలనుకునే వారు అలాగే మాట్లాడతారని.. రేవంత్ కు రోజు రాజకీయాలు కావాలని చురకలు అంటించారు పేర్ని నాని.