ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తాను అనుకూలం..కేసీఆర్‌ కు సహకరిస్తా : జగ్గారెడ్డి

-

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యల చేశారు. తెలంగాణలో ఈ మధ్య లో కొత్త చర్చ జరుగుతోందని… సమైక్యంగా ఉంటే బాగుండు అనే కోణంలో మాట్లాడుటున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎవరు సంతృప్తిలో లేరని…. ఉద్యోగులు, విద్యార్థుల్లో అసంతృప్తి కనిపిస్తోందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాలకే రాష్ట్రం కలిసి ఉండాలని చర్చ వచ్చిందని.. షర్మిల తెలంగాణ కోడలు అనే పేరుతో స్పెస్ తీసుకునే ప్రయత్నం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ నుంచి కూడా తెలంగాణ కొడుకును అని ఎవరైనా రావొచ్చని… జగన్ పిల్లలు కూడా తెలంగాణనే అని చెప్పొచ్చని తెలిపారు. కొంత గందరగోళం ఏర్పడిందని… లోకేష్ కూడా తెలంగాణలో పుట్టనానని చెబుతున్నారన్నారు. రాయచూరు, మహారాష్ట్ర, ఏపి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తమను కలపండి అనే డిమాండ్లు చూస్తున్నామని… బీజేపీ గోడ మీద కూర్చుంటారు. కలవమంటే కలుపుతారు. విడగొట్టమంటే విడగడతారు. కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోదన్నారు.

తాను మూడు ప్రాంతాలు కలిసి ఉండాలని చెప్పానని… సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన తరువాత కూడా తన వాయిస్ వినిపించానని తెలిపారు. గతంలో తాను చెప్పిన విషయాన్నే ఇప్పుడు అందరు అంటున్నారని… రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పీసీసీ హోదాలో అన్నారని వెల్లడించారు. రెండు రాష్ట్రాలు కలుపుతా అంటే తన సంపూర్ణ మద్దతు ఇస్తానని… కేసీఆర్ కు సహకరిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలు సమర్ధనీయమని… టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఫైనల్ కాదన్నారు. తాను వ్యక్తిగతంగా తన అభిప్రాయం చెబుతున్నానని..  పీసీసీ అధ్యక్షుడుగా ఉంటే తాను అంత స్వతంత్రగా మాట్లాడే వాణ్ణి కాదన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాలను రేవంత్ రెడ్డి డామినేట్ చేసే అధికారం రేవంత్ కు లేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news