హైద‌రాబాద్ లో ఇద్ద‌రు పురుషుల ప్రేమ వివాహం…!

-

దేశంలో అక్క‌డ‌క్క‌డా ఇద్ద‌రు పురుషులు..ఇద్ద‌రు స్త్రీలు వివాహం చేసుకుని ఒక్క‌ట‌వుతున్న ఘ‌ట‌న‌లు చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా అలాంటి సంఘ‌ట‌న హైద‌రాబాద్ లోనే చోటు చేసుకుంది. అంతే కాకుండా తెలంగాణ‌లో ఇద్ద‌రు పురుషులు స్వ‌లింగ సంప‌ర్కులు పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌వ్వ‌డం ఇదే మొద‌టిసారి కూడా…వివ‌రాల్లోకి వెళితే..హైద‌రాబాద్ కు చెందిన సుప్రియో మ‌రియు అభ‌య్ అనే ఇద్ద‌రు స్వ‌లింగ సంప‌ర్కుల మ‌ధ్య ఓ డేటింగ్ యాప్ లో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

hyderbad two mens marraiage
hyderbad two mens marraiage

దాంతో ఎనిమిదేళ్లుగా వాళ్లిద్ద‌రూ ప్రేమించుకుంటున్నారు. ఇక ఎనిమిదేళ్లుగా ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాల‌ని నిశ్చయించుకున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ త‌ల్లి దండ్రుల‌ను సైతం పెళ్లికి ఒప్పించారు. ఇక పెళ్లికి పెద్ద‌లు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. అంతే కాకుండా వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మంగ‌ళ‌స్నానాలు…ఉంగ‌రాలు మ‌ర్చుకునే కార్య‌క్ర‌మాలు అన్నీ సాధార‌ణ పెళ్లిని పోలిన‌ట్టే ఉంటాయ‌ని వారు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news